Friday, January 18, 2019

17th Vivek Voluntary Blood Donation Camp, 2019 TELUGU MESSAGE

స్వామి వివేకానందుని 157వ జన్మదినోత్సవమును పురస్కరించుకుని విశాఖపట్నం వివేకానంద యువ మహామండలి వారు 17వ వివేక స్వచ్చంధ రక్తదాన శిబిరాన్ని నిర్వహించుచున్నారు.


వేదిక:   స్వామి వివేకానంద మండపం, ప్రశాంతి ఆధ్యాత్మిక పార్క్, మురళీ నగర్, విశాఖపట్నం

తేదీ: జనవరి 20 (ఆదివారం)

సమయం: ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు

బ్లడ్ బ్యాంక్: ఏ. ఎస్. రాజా వాలంటరీ బ్లడ్ బ్యాంక్

రక్త దాతలకు కొన్ని సూచనలు:
1)రక్తదానం చేసే వారి వయస్సు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్యలో ఉండాలి

2)రక్తదానం చేసే వారి కనీస బరువు 45 కేజీలకు తగ్గి ఉండరాదు.

3)రక్తదానం చేసే వారి హిమోగ్లోబిన్ శాతం 12.5 కంటే ఎక్కువ ఉండాలి

4)డయాబెటిక్ పేషెంట్స్ రక్తదానం చెయ్యాలి అనుకుంటే వారి జనవరి 18వ తారీఖు తరవాత చేయించిన షుగర్ రిపోర్ట్ తప్పనిసరిగా తీసుకు రావాలి.

5)బి.పి. పేషెంట్స్ బి.పి. మాత్రలను వేసుకున్న తర్వాతే రక్త దానానికి రావలెను.

6)అల్పా ఆహారము తీసుకున్న అర గంట తర్వాత గానీ భోజన అనంతరం ఒక గంట తరవాత గాని రక్త దానానికి రావలెను.

7)  మీరు యాంటీ బయోటిక్స్ వాడుతూ ఉన్నట్లయితే రక్తదానము చేసే 48 గంటల ముందు నుంచి యాంటీ బయోటిక్స్ తీసుకోవడం ఆపెయ్యాలి.

8)ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానము చెయ్యవచ్చు.

ఈ రక్తదాన శిబిరంలో రక్తాన్ని దానం చేసిన వారికి సర్టిఫికెట్ , డోనార్ కార్డ్ మరియు వివేకానంద సాహిత్యం ఇవ్వబడును.

డోనార్ కార్డ్ గల వారికి, వారి సన్నిహితులకు ఎప్పుడైనా రక్తం అవసరం అయిన సందర్భాలలో రక్తం అందించబడును.

వేదిక వద్ద రామకృష్ణ వివేకానంద సాహిత్యంతో కూడిన బుక్ స్టాల్ ఏర్పాటు చేయబడును.

రక్తదానము చెయ్యడానికి మరియు ఇతర వివరాల కొరకు ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించండి
9494926770, 7893812701,9849811940


vvym@yahoo.co.in
idonatebloodinvizag@gmail.com

బ్లాగ్: www.vvym.blogspot.com

No comments: