యువజనులకు,
స్వామి వివేకానంద సాహిత్యం అందించాలని సంకల్పించాం.
'విశాఖపట్నం వివేకానంద యువ మహామండలి' వారు ప్రతివారం నిర్వహించే 'వివేకానంద అధ్యయన మండలి'లలో పాల్గొను యువకులు కొందరు' శ్రీ వివేకానందస్వామి సాహిత్యంలోని ప్రధాన అంశాలను (చికాగో ఉపన్యాసములు, నాలుగు యోగాలు, సందేశ తరంగిణి, లేఖావళి మొ||నవి ) ఒకటి తరువాత ఒకటిగా ఆడియో రూపంలో అందించుటకు ముందుకు వచ్చారు.
దీని గురించి 'శ్రీ వివేకానంద శంఖారావం' అనే గ్రూపును సెప్టెంబర్ 11 న(స్వామీజీ చికాగోలో మొదటి ఉపన్యాసం ఇచ్చిన రోజు) ప్రారంభించాము.
శ్రీ మల్లెంపాటి వంశీ చికాగో ఉపన్యాసములను ఆ రోజు నుంచి వినిపిస్తున్నారు.
దీని గురించి మనం ప్రారంభించిన జట్టు నిండినందున 'శ్రీ వివేకానంద శంఖారావం 2' అనే రెండవ జట్టును ప్రారంభిస్తున్నాం.
మీ మిత్రులకు ఈ లింక్ ను(link) అందించి మన స్వామి సందేశంను నలుచెరుగులా వ్యాప్తి చేయగలరని ఆశిస్తున్నాం
జయ శ్రీ రామకృష్ణ జయ మా శారదా
జయ వివేకానంద
Follow this link to join శ్రీ వివేకానంద శంఖారావం group:
No comments:
Post a Comment